Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటర్ విద్యా కమిషనర్‌కు టిప్స్ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ (టీడీఎస్) పదిశాతంను కట్ చేయొద్దని తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి (టిప్స్) డిమాండ్ చేసింది. ఈ మేరకు ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్లు, ఆదాయపు పన్ను శాఖ అధికారులు, న్యాయవాదులతో చర్చించిన అనంతరం ఇంటర్ విద్యా కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్‌ను సోమవారం టిప్స్ కన్వీనర్లు మాచర్ల రామకృష్ణగౌడ్, కొప్పిశెట్టి సురేష్, సమన్వయకర్త ఎం జంగయ్య నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. కాంట్రాక్టు అధ్యాపకులు 194 జే కిందికి రాబోరనీ, కేవలం 192 కింద మాత్రమే వస్తారని వివరించారు. వాటికి సంబంధించిన జీవోలను అందించారు. దీనికి సానుకూలంగా కమిషనర్ స్పందించారని తెలిపారు. చార్టెడ్ అకౌంటెంట్లు, ఆదాయపు పన్ను శాఖ అధికారులతో మాట్లాడి రెండు రోజుల్లో రాతపూర్వకంగా ఇందుకు సంబంధించిన పూర్తి వివరణ ఇస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. కాంట్రాక్టు అధ్యాపకులకు ఏ విధమైన ఆర్థిక నష్టం జరగకుండా చూస్తామన్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం (475) రాష్ట్ర వరింగ్ ప్రెసిడెంట్ వస్కుల శ్రీనివాస్, నాయకులు వ్యామసాని రవీందర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.