Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌కేర్ మేనేజ్మెంట్, కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్) సంయుక్తంగా నిర్వహించిన హాస్పిటల్ అండ్ హెల్త్‌కేర్ మేనేజ్మెంట్ (ఎంబీఏ)లో ప్రవేశాల కోసం ఈనెల 16న కౌన్సెలింగ్ జరగనుంది. ఈ మేరకు ఆ వర్సిటీ రిజిస్ట్రార్ జి లక్ష్మారెడ్డి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రవేశ పరీక్ష రాసి అర్హత సాధించిన వారికి ప్రవేశాల కోసం ఈనెల 16న ఉదయం 10 గంటలకు విశ్వవిద్యాలయంలో కౌన్సెలింగ్ జరుగుతుందని వివరించారు. పూర్తి వివరాలకు www.braou.ac.in లేదా www.braouonline.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.