Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కండువా కప్పి ఆహ్వానించిన రేవంత్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
బీజేపీ సీనియర్ నేత కొలన్ హనుమంతరెడ్డి కాంగ్రెస్లో చేరారు. మంగళవారం జూబ్లీహిల్స్ల్లోని మల్కాజిగిరి పార్లమెంటు కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వందలాది మంది అనుచరులతో ఆయన కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లురవి, డీసీసీ అధ్యక్షులు నందికంటి శ్రీధర్, ప్రధాన కార్యదర్శి హర్కర వేణుగోపాల్ తదితరులు ఉన్నారు.