Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిందితుడిని చితకబాది పోలీసులకు అప్పగింత
నవతెలంగాణ-బోధన్
వృద్ధురాలిపై ఓ వ్యక్తి లైంగికదాడి యత్నం చేశాడు. ఈ దారుణ ఘటన నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని ఓ గ్రామంలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన 65 ఏండ్ల వృద్ధురాలిపై అదే గ్రామానికి చెందిన సాయిలు(40) లైంగికదాడికి యత్నించాడు. గమనించిన స్థానికులు నిందితుడిని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై గతంలో సైతం లైంగికదాడియత్నం కేసులు నమోదై ఉన్నట్టు సమాచారం. నిందితులకు కఠిన శిక్షలు అమలు చేయకపోవడంతో ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారనీ, ఇక నుంచైనా కఠిన శిక్షలు అమలు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.