Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (హైదరాబాద్), బాబాసాహెబ్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (అహ్మదాబాద్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. అన్ని డిగ్రీ కోర్సుల మెటీరియల్‌ను పరస్పరం అందించుకోవడానికి శుక్రవారం హైదరాబాద్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ క్రమంలో రాబోయే రోజుల్లో కోర్సుల రూపకల్పన, పరిశోధన వంటి అంశాల్లో పరస్పరం సహకరించుకునేందుకు అవకాశముంటుంది. అంబేద్కర్ వర్సిటీ వీసీ కె సీతారామారావు, బాబాసాహెబ్ అంబేద్కర్ వర్సిటీ వీసీ అమీ ఉపాధ్యాయ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ వర్సిటీ అకడమిక్ డైరెక్టర్ సుధారాణి, రిజిస్ట్రార్ జి లక్ష్మారెడ్డి, సోషల్ సైన్స్ డీన్ ఘంటా చక్రపాణి, డైరెక్టర్ పి మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.