Authorization
Mon April 28, 2025 07:40:36 pm
- ఏడు గంటల పాటు విచారణ
నవ తెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
డ్రగ్స్, మనీ లాండరింగ్ కేసులో హీరో తనిష్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు ఏడు గంటల పాటు విచారించారు. డ్రగ్స్ వినియోగం, డ్రగ్స్ విక్రేత కెల్విన్‌కు డబ్బులు బదిలీ మొదలైన అంశాలపై తనిష్పై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. శుక్రవారం ఉదయం పది గంటల ప్రాంతంలలో తనిష్ ఈడీ కార్యాలయానికి చేరుకోగా పది నిమిషాల తర్వాత ఈడీ అధికారులు నటుడ్ని విచారించడం ప్రారంభించారు. ముఖ్యంగా తనిష్‌కు చెందిన మూడేండ్ల బ్యాంకు లావాదేవీల వివరాలను ముందుంచుకుని అధికారులు విచారణ జరిపారు. ప్రధానంగా తనిష్ అకౌంట్ల నుంచి డ్రగ్స్ సరఫరా దారుడు కెల్విన్, కమింగ, పీటర్ల అకౌంట్లకు డబ్బులు బదిలీ అయిన తీరుపై అధికారులు దృష్టి సారించారు. తనిష్ నుంచి సమాచారాన్ని రాబట్టడానికి ప్రయత్నించారని తెలిసింది. అలాగే తనిష్ వాట్సాప్ నుంచి అనేక మార్లు కెల్విన్‌తో చాటింగ్ చేయడాన్ని కూడా అధికారులు గుర్తించారని తెలిసింది. మొత్తం మీద ఎఫ్ క్లబ్‌కు ఎ క్కువగా వెళ్తూ పలు పార్టీలలో తనిష్ పాల్గొన్నట్టుగా కూడా ఈడీ అధికారులు సమచారాన్ని సేకరించారని తెలిసింది. ప్రధానంగా తనిష్ బ్యాంకు అకౌంట్లలోని అనుమానాస్పద లావాదేవీలపై అధికారులు తనిష్‌ను గుచ్చి గుచ్చి ప్రశ్నించారని తెలిసింది. దాదాపు ఏడు గంటల పాటు విచారణ పూర్తయ్యాక వెలుపలికి వచ్చిన నటుడు తనిష్ తాను ఈడీ అధికారుల అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాననీ , అవసరమై పిలిస్తే మళ్లీ వస్తానని తెలిపినట్టు విలేకరులకు తెలిపాడు.