Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్జేడీ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల బదిలీల ప్రక్రియను చేపట్టాలని ఆర్జేడీ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం అధ్యక్షులు గాదె వెంకన్న, ప్రధాన కార్యదర్శి కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాంట్రాక్టు అధ్యాపకుల బదిలీల విషయంలో ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులను అమలు చేస్తూ ఇంటర్ విద్యా కమిషనర్ తగిన మార్గదర్శకాలను విడుదల చేయాలని కోరారు. వెంటనే ఆ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.