Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ సాయుధ పోరాటంలో బీజేపీ పాత్ర 'సున్నా'
- హిందువులు, ముస్లింలు ఐక్యంగా పోరాడారు
- చరిత్ర తెలియని కొత్త బిక్షగాల్లు నిర్మల్‌కు వచ్చారు
- కోఠి మెట్రోకు 'తుర్రెబాజ్ ఖాన్ మెట్రో స్టేషన్‌గా పేరు పెట్టాలి : జాతీయజెండా ఆవిష్కరణలో రేవంత్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నది, పోరాడింది కాంగ్రెస్, కమ్యూనిస్టులేననీ,ఆ మహత్తర పోరాటంలో బీజేపీ పాత్ర సున్నా అని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. ఆనాడు హిందువులు, ముస్లింలు ఉమ్మడిగా పోరాడారనీ, ఆ చరిత్రను వక్రీకరించేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. 'వెయ్యి ఉరుల ఊడల మర్రి' ఘటన ఎప్పుడు జరిగిందో, దాని చరిత్ర కూడా తెలియని కొత్త బిచ్చగాళ్లు నిర్మల్‌కు వచ్చారంటూ కేంద్ర హౌంమంత్రి అమిత్షాపైను పరోక్షంగా విమర్శించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం గాంధీభవన్ ఆవరణలో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సెప్టెంబర్ 17ను తెలంగాణ స్వతంత్ర దినోత్సవంగా అధికారికంగా జరుపుతామని హామీ ఇచ్చారు. బ్రిటిష్ ప్రభుత్వం నుంచి భారతదేశానికి స్వాతంత్య్ర వచ్చినప్పుడు నిజాం పాలకులు ఇండియాలో విలీనం చేసేందుకు స్వతంత్రంగా ఉండాలని లేదా పాకిస్తాన్లో విలీనం చేయాలని ప్రయత్నించారని పేర్కొన్నారు. అప్పుడు ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆదేశాలతో సర్దార్ వల్లభారు పటేల్ 'ఆపరేషన్‌పోలో' జరిపి తెలంగాణను భారత్‌లో విలీనం చేశారని గుర్తు చేశారు. సెప్టెంబర్ 17 తెలంగాణకు స్వాతంత్రం వచ్చిన రోజు అనీ, ఆ ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందని చెప్పారు. ఇప్పుడు కొంతమంది కొత్త బిచ్చగాళ్ల వచ్చారనీ, చరిత్ర ఎప్పుడు జరిగిందో కూడా వాళ్లకు తెలియదని విమర్శించారు. నెహ్రు నిర్ణయం వల్లనే తెలంగాణ విలీనం జరిగిందన్నారు. ప్రధాన మంత్రి నిర్ణయం హౌం శాఖ మంత్రి అమలు చేస్తారనే విషయం కూడా బీజేపీ నేతలకు తెలియకపోవడం విచారకరమన్నారు. తెలంగాణ విలీనాన్ని సర్ధార్ వల్లభారు పటేల్ చేసినట్టు బీజేపీ నేతలు చెప్పడం వారి అజ్ఞానానికి నిదర్శనమన్నారు. సర్దార్ వల్లభారు పటేల్ కూడా కాంగ్రెస్ అధ్యక్షులుగా, కేంద్ర హౌం శాఖ మంత్రిగా పని చేశారని గుర్తు చేశారు. బీజేపీకి చెప్పుకోవడానికి ఒక్క నాయకుడు కూడా లేరనీ, అందుకే కాంగ్రెస్ నేతల పేర్లు వాడుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణలో నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన దొడ్డి కొమురయ్య, షోయబుల్లాఖాన్, రాంజీ, చాకలి అయిలమ్మ, కొమురం భీంల పోరాట స్ఫూర్తితో ప్రజాసమస్యలపై పని చేస్తామన్నారు. కోఠి మెట్రో రైల్ స్టేషన్‌ను తుర్రెబాజ్ ఖాన్ మెట్రో రైల్ స్టేషన్‌కు నామకరణం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బలరాం నాయక్, నిరంజన్, సంభాని చంద్రశేఖర్, కోదండరెడ్డి, హర్కర వేణుగోపాల్, మానవతారారు, నూతి శ్రీకాంత్, మెట్టుసాయికుమార్, సేవాదల్ చైర్మెన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.