Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ కు అమెరికాకు చెందిన డే స్ప్రింగ్ క్రిస్టియన్ యూనివర్సిటీ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. శనివారం ఇండో ఇజ్రాయెల్ ఫ్రెండ్షిఫ్ అసోసియేషన్ 28వ వారోత్సవాలు హైదరాబాద్‌లోని బిర్లా ఆడిటోరియంలో జరిగాయి. కార్యక్రమంలో మంత్రితో పాటు వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి డాక్టరేట్లను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కుల, మతాలు మనిషి బతుకున్నంత కాలమే ఉంటాయనీ, సహాయం చేసిన వారు చనిపోయినా ఆ సాయం పొందిన వారి మనసులో బతికే ఉంటారని చెప్పారు. ఇండియా , ఇజ్రాయెల్ దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడేందుకు వీలుగా అసోసియేషన్ కృషిని మంత్రి అభినందించారు.