Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సాయుధ దళాల ఫ్లాగ్ డే ఫండ్ కోసం ఉద్యోగులు, కార్పొరేట్లు ఉదారంగా సహకరించాలని గవర్నర్ తమిళసై సౌందరరాజన్ విజ్ఞప్తి చేశారు. ఈ ఫండ్‌కు విరాళాలను పెంచే పద్ధతులను అధ్యయనం చేయడానికి ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ఆమె ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలోని సాయుధ దళాల ఫ్లాగ్ డే ఫండ్ రాష్ట్ర మేనేజింగ్ కమిటీ 3వ సమావేశం రాజ్‌భవన్‌లో గవర్నర్ అధ్యక్షతన జరిగింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శివ సోమేశ్ కుమార్, హౌం శాఖ కార్యదర్శి రవి గుప్తా, ఆర్ధిక శాఖ కార్యదర్శి రొనాల్డ్ రోస్, మేజర్ జనరల్ ఆర్కె సింగ్, జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (జీఓసీ), తెలంగాణ మరియు ఆంధ్ర సబ్ ఏరియా (టాసా) మేజర్ జనరల్ ఎన్ శ్రీనివాసరావు, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఎల్ షర్మన్ తదితరులు పాల్గొన్నారు. సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్, సాయుధ బలగాల ఫ్లాగ్ డే ఫండ్ సెక్రటరీ కల్నల్ పి రమేష్ కుమార్ సంస్థ కార్యకలాపాలను వివరించారు. సమావేశంలో పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. మాజీ సైనికుల కుటుంబాలకు తక్షణ మరణ సహాయం అందించాలనీ, మాజీ సైనికుల ఆడపిల్లల వివాహం కోసం ప్రస్తుతం ఉన్న రూ.30వేల నగదును రూ.40వేలకు పెంచాలనీ నిర్ణయించారు. సీఏ, సీఎస్, ఐసీడబ్ల్యూఏ, పీహెచ్డీ చేసే మాజీ సైనికుల పిల్లలకు అందించే ఆర్థిక సహాయాన్ని రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచారు. ఆదిలాబాద్, కొత్తగూడెంలో సైనిక్ భవన్ల నిర్మాణానికి ఒక్కొక్కదానికి రూ.20 లక్షలు మంజూరీకి ఆమోదం తెలిపారు.