Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఒక్క రోజులో రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ నిర్వహించింది. శుక్రవారం ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా 5.27 లక్షల మందికి టీకాలు ఇచ్చారు. ఈ మేరకు ఆ శాఖ శనివారం ఉదయం కోవిడ్-19 మీడియా రిపోర్ట్ ను విడుదల చేసింది. 3,77,391 మందికి మొదటి డోసు, 1,50,166 మందికి రెండో డోసును, మొత్తం 5,27,557 మందికి టీకాలు వేశారు. రాష్ట్రంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రారంభించిన తర్వాత ఒకే రోజు ఇంత ఎక్కువ మందికి వ్యాక్సిన్ ఇవ్వటం తొలిసారి.