Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ప్రత్యేక ప్రతినిధి
తెలుగు చిత్ర పరిశ్రమలో అలజడి సృష్టించిన డ్రగ్స్ వ్యవహారంలో ప్రముఖ సినీ దర్శకులు పూరీ జగన్నాథ్, నటుడు తరుణ్‌లకు ఎఫ్ఎస్ఎల్ క్లీన్చిట్ ఇచ్చింది. వారిరువురి నుంచి సేకరించిన రక్తం, వెంట్రుకలు, గోళ్ల అవశేషాల్లో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ నివేదిక వెల్లడించింది. డ్రగ్స్ కేసుకు సంబంధించి 2017 జులైలో ఎక్సైజ్ ఎన్పోర్స్మెంట్ విచారణకు పూరి జగన్నాథ్, తరుణ్‌లు హాజరయ్యారు. వారితో పాటు సినీ పరిశ్రమకు చెందిన మరో 60 మందిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విచారించింది. ఇటీవల ఎక్సైజ్ శాఖ కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేసింది. విచారణ కు హాజరైన వారి వద్ద నుంచి సేకరించిన నమూనాల ఎఫ్ఎస్ఎల్ నివేదికను కూడా ఛార్జిషీటుకు అధికారులు జత చేశారు. అధికారుల నుంచి వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు దర్శకుడు పూరీజగన్నాథ్, నటుడు తరుణ్‌ల నుంచి సేకరించిన నమూనాల్లో గతంలో వారు డ్రగ్స్ తీసుకున్నట్టు ఎటువంటి ఆనవాళ్లులేవని ఎఫ్ఎస్ఎల్ అసిస్టెంట్ డైరెక్టర్ తన నివేదికలో పేర్కొన్నారు. మిగిలిన 16 మందికి కూడా క్లీన్చిట్ ఇచ్చినట్టు తెలిసింది.