Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్బీఏ అండ్ న్యాక్ 'ఏ' గ్రేడ్ గుర్తింపు పొందిన కాలేజీ
- సువిశాలమైన 52 ఎకరాల క్యాంపస్
- ప్రాంగణ నియామకాల్లోనూ ముందంజ
- ఉన్నత విద్యనందించడమే లక్ష్యంగా ఏర్పాటు..
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఇంజనీరింగ్ విద్యా బోధనలో మర్రి లక్ష్మణ్ రెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అగ్రగామిగా నిలుస్తోంది. సువిశాలమైన 52 ఎకరాల క్యాంపస్‌తో విద్యార్థులకు అత్యాధునిక సదుపాయాలతో అందుబాటులో ఉన్నది. హైదరాబాద్‌లోని దుండిగల్ దగ్గరలో ప్రముఖ విద్యావేత్త, వెటరన్ ఇంటర్నెషనల్ అథ్లెటిక్ మర్రి లక్ష్మణ్ రెడ్డి 2005లో 'ఎంఎల్ఆర్ఐటీ'(యూజీసీ, అటానమస్), 2009లో మర్రి లక్ష్మణ్‌రెడ్డి ఐటీఎం'(ఎన్బీఏ, న్యాక్ 'ఏ' గ్రేడ్), 2007లో ఎంఎల్ఆర్ఐపీను స్థాపించారు. దాదాపు 30 ఏండ్లుగా విద్యార్థులకు స్కూల్, కాలేజీ స్థాయిలో నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అంచెలంచెలుగా ఇంజనీరింగ్ విద్యా బోధనలో తనదైన ముద్ర వేసుకుని ఎంఎల్ఆర్ఐటీ ప్రఖ్యాతిగాంచింది. నాణ్యమైన ఉన్నత విద్యా అందించడమే లక్ష్యంగా యాజమాన్యం నిరంతరంగా పనిచేస్తోంది. నిష్టాతులైన ఫ్యాకల్టీలతో నాణ్యమైన విద్యాను అందిస్తూ.. ఆయా కోర్సుల వారిగా ల్యాబ్‌లను సువిశాలంగా ఏర్పాటు చేసింది. అంతేగాక ఎంఎల్ఆర్ఐటీ ప్రారంభమైన తొలి ఏడాది నుంచి విద్యార్థులకు వందల సంఖ్యలో ప్రాంగణ నియామకాలను అందించి రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బడాబడా కంపెనీలు ప్రతియేటా క్యాంపస్ నియామకాల కోసం ఎంఎల్ఆర్ఐటీఎం క్యాంపస్‌కు క్యూ కడుతున్నాయి. గత కొన్నేండ్లుగా పలు కార్పొరేట్ కంపెనీల్లో మర్రి లక్ష్మణ్ రెడ్డి విద్యార్థులు సుమారు 5వేలకుపైగా ఉద్యోగాలు పొందారు. ఇక కాలేజ్‌లో వివిధ క్రీడలు ఆడుకునేందుకు విశాలమైన ఆటస్థలాలు, రవాణా సౌకర్యం, వైద్య సదుపాయం, పార్కింగ్, జీమ్, ఇండోర్, క్రికెట్ స్టేడియం, ప్రతియేటా పలు సాంస్కృతిక కార్యక్రమాలను సైతం నిర్వహిస్తోంది.
కోర్సుల వివరాలు ఇలా..
బీటెక్‌లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్(ఏరో), సివిల్, సీఎస్ఈ, ఈసీఈ, ఈఈఈ, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్సులు ఉన్నాయి. వీటితో పాటు ఎంటెక్ కోర్సుల్లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్, క్యాడ్..క్యామ్, సీఎస్ఈ, డిజిటల్ సిస్టమ్స్ అండ్ కంప్యూటర్ ఎలక్ట్రానిక్స్, ఈఎస్, ఎస్ఈ, టీఈతో పాటు ఫార్మా, ఎంబీఏ కోర్సులను అందిస్తోంది.
కోర్సులకు అనుగుణంగా ల్యాబ్‌ల ఏర్పాటు..
ఇంజనీరింగ్ విద్యా బోధనలో ల్యాబ్‌లకు ప్రత్యేక స్థానం ఉంది. ఇది గుర్తించిన మర్రి లక్ష్మణ్ రెడ్డి సంస్థ ప్రతి విభాగానికి భారీ స్థలాన్ని కేటాయించింది. అలాగే ఎయిర్ కండిషన్ అడిటోరియమ్స్, 10జీడీ అండ్ 20 పర్సనల్ ఇంటర్వ్యూ గదులు, వేరువేరుగా బార్సు అండ్ గర్ల్స్ హాస్టల్స్ ఉన్నాయి. దీంతో పాటు కాలేజీకి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్, స్పోర్ట్స్ స్కాలర్షిప్స్, ఇంటర్నెషనల్ పార్టనర్షిప్స్, టెక్నాలజీ బిజినెస్ ఇంక్యూబేటర్, రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్, 29కిపైగా ఫండెండ్ ప్రాజెక్టులు, 100కుపైగా ఎంవోలు, 28కుపైగా పెటెంట్స్, 70కిపైగా పీహెచ్డీ ఫ్యాకల్టీ, ఏడాదికి 560 ప్లేస్‌మెంట్స్ కల్పించడం మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ ప్రత్యేకత.
ప్రాంగణ నియామకాల్లో ముందంజ
మర్రి లక్ష్మణ్ రెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ను ఏర్పాటు చేసిన ఆనాతీకాలంలోనే ప్రాంగణ నియామకాల్లో ముందు వరుసలో నిలుస్తూ వస్తోంది. ప్రతియేటా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ సాధించడంలో మెరుగువుతూనే ఉంది. ప్రతి సంవత్సరం నిర్వహించే ప్రాంగణ మౌఖిక పరీక్షలో మర్రి లక్ష్మణ్ రెడ్డి విద్యార్థులు 560కుపైగా ఉద్యోగాలు సాధిస్తున్నారు. దేశ, విదేశాల్లో నెలకొన్న బడా కంపెనీల్లో వేలాది మంది మర్రి లక్ష్మణ్ రెడ్డి విద్యార్థులు పనిచేస్తున్నారు. ఇంజనీరింగ్ విద్యలో ప్రతి సంవత్సరం రారాజుగా నిలువడంలో సంస్థ వ్యవస్థాపకులు, చైర్మెన్ మర్రి లక్ష్మణ్ రెడ్డి, కార్యదర్శి మర్రి రాజశేఖర్ రెడ్డి కీలకంగా వ్యవహరించడంతో పాటు డాక్టర్ కె. శ్రీనివాస్‌రావు, (ప్రిన్సిపాల్, ఎంఎల్ఆర్ఐటీ), డాక్టర్ కె.వెంకటేశ్వర రెడ్డి (ప్రినిపాల్, మర్రిలక్ష్మణ్ రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజేమెంట్), డాక్టర్ కె.ఎస్.మురళీ కృష్ణ( ప్రిన్సిపాల్, ఎంఎల్ఆర్ఐపీ) కాలేజీని ముందంజలో నిలుపడంలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు.