Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రంలో కేరళ కంపెనీ రూ.2,400 కోట్ల పెట్టుబడి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కైటెక్స్ గ్రూప్ రాష్ట్రంలో రూ.2,400 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిందనీ, దీనివల్ల ప్రత్యక్షంగా 22వేల మందికి ఉద్యోగావకాశాలు, పరోక్షంగా 18వేల మందికి ఉపాధి లభిస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె తారకరామారావు తెలిపారు. శనివారంనాడిక్కడి ఓ నక్షత్ర హౌటల్లో కైటెక్స్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం (ఎమ్ఓయూ) కుదుర్చుకుంది. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. 2022 నవంబర్ నాటికి కైటెక్స్ గ్రూప్ తన ఉత్పత్తుల్ని ప్రారంభిస్తుందనీ, దీనికి అవసరమైన అన్ని రకాల పాలనా అనుమతులు, ఇతర సౌకర్యాలన్నింటినీ తమ శాఖ అధికారులు సమకూరుస్తారని తెలిపారు. చిన్న పిల్లల వస్త్రాలు ఉత్పత్తి చేసే ఈ సంస్థలో మహిళలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అధికంగా ఉంటాయన్నారు. వరంగల్ జిల్లా చందనవెల్లి, రంగారెడ్డి జిల్లా సీతారాంపూర్‌లో కైటెక్స్ సంస్థ తన యూనిట్లను నెలకొల్పుతున్నట్టు వివరించారు. కేరళలో ప్రయివేటు రంగంలో అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న కైటెక్స్ సంస్థకు ప్రపంచంలో మంచి పేరు ఉన్నదనీ, ఆ ఉత్పత్తులు ఇకపై తెలంగాణ నుంచే ఎగుమతి వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్సైటైల్ పార్క్, రంగారెడ్డి జిల్లాలోని సీతారాంపురంలో ఇంటిగ్రేటెడ్ ఫైబర్ టు అప్పారెల్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లను ఈ సంస్థ ఏర్పాటు చేస్తుందన్నారు. సంస్థ చైర్మెన్ సాబూ జాకబ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను సమర్థవంతంగా నిర్వహిస్తుందని చెప్పారు.కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సబితా ఇంద్రారెడ్డి, ఐటీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్‌రంజన్, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే కాలే యాదయ్య తదితరులు పాల్గొన్నారు.