Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మికులను కట్టుబానిసలుగా మార్చే యత్నంలో బీజేపీ సర్కార్ : సీఐటీయూ ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గపూర్
- చర్లపల్లి పారిశ్రామిక వాడలో సీఐటీయూ కార్మిక గర్జన సభ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న పాలకులు బ్రిటీషోళ్ల కంటే దుర్మార్గులనీ, కార్మికులను కట్టుబానిసలుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని సీఐటీయూ ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ఎంఏ గపూర్ విమర్శిం చారు. మేడ్చల్ మల్కాజిగిరిజిల్లా చర్లపల్లి పారిశ్రామిక వాడలో సీఐటీయూ కార్మిక గర్జన పాదయాత్ర శనివారం సాగింది. పాదయాత్ర బృంద సభ్యులు పాలడుగు భాస్కర్, జయలక్ష్మి, భూపాల్, ఎస్.వీరయ్యను శాలువాలతో సత్క రించి అభినందనలు తెలిపారు. ఆ తర్వాత జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్రానికి ముందు కార్మికులు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తే అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం దిగివచ్చి సంఘం పెట్టుకునే, సమాన పనికి సమానవేతనం, 8 గంటల పని హక్కులను కల్పించిందని గుర్తు చేశారు. కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకునే ప్రభుత్వాలు నేడు అధికారంలో లేవనీ, పెట్టుబడుదారులకు ఊడిగం చేసేవిగా అవి మారాయని విమర్శించారు. మోడీ సర్కారు 12 గంటల పనివిధానాన్ని తెచ్చి భారతదేశాన్ని 150 ఏండ్ల వెనక్కి తీసుకుపోయిందన్నారు. కరోనా సమయంలో అమెరికా ప్రభుత్వం ఒక్కో కార్మికునికి రూ.84 వేలు, చైనా ప్రభుత్వం లక్ష రూపాయలను సహాయంగా అందించాయ న్నారు. కార్మికులకు 80 శాతం వేతనాలను బ్రిటన్ ప్రభుత్వమే చెల్లించిందన్నారు. మోడీ సర్కారు మాత్రం 2 సార్లు లాక్డౌన్ విధించినా కార్మికులకు నయా పైసా సహాయం చేయలేదన్నారు. అదే సమయంలో కార్పొరేట్ సంస్థలకు మాత్రం 2 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిందని విమర్శించారు. 10, 15 ఏండ్లుగా కార్మికులకు షెడ్యూల్డ్ పరిశ్రమల్లో వేతనాలు పెంచలేదనీ, అదే సమయంలో నిత్యావసరాల ధరలు మాత్రం వందల రెట్లు పెరిగాయనీ, మోడీ సర్కారు వచ్చాక 66 సార్లు పెట్రోల్, 63 సార్లు డీజిల్ ధరలు పెరిగాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో అరకొర వేతనాలతో కార్మికులు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. ఇలాంటి పాలకులపై కార్మికులంతా సంఘటితమై పోరాటం చేస్తేనే విజయం దక్కుతుందన్నారు. సీఐటీయూ రాష్ట్ర కార్య దర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ..తమది పార్లమెంట్, అసెంబ్లీ పీఠాలను దక్కించుకోవాలనే ఆశతో చేస్తున్న పాదయాత్ర కాదన్నారు. రాష్ట్రంలోని కోటీ 20 లక్షల మందికి కనీస వేతనాలు పెంచేందుకు వీలుగా పాలకులపై ఒత్తిడి చేసేందుకు తాము పాదయాత్ర చేస్తున్నామన్నారు. తమది కార్మికపక్షపాత యాత్ర అన్నారు. కార్మికులకు కనీసవేతనాలు పెంచే ఫైళ్లపై సంతకాలు పెట్టడానికి మనసొప్పని మన పాలకులు తమ వేతనాలను మాత్రం పెంచుకున్నారని విమ ర్శించారు. కార్మికుల పక్షాన నిలుస్తారో? పెట్టుబడుదారులకు కొమ్ముకాస్తారో సీఎం కేసీఆర్ తేల్చుకోవాలన్నారు. కార్మికు లకు వేతన జీవోలివ్వకపోతే అక్టోబర్ 8న సమ్మె చేసితీరు తామని హెచ్చరించారు. సీఐటీయూ రాష్ట్రఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య మాట్లా డుతూ.. బండి సంజరు తన పాదయాత్రలో కార్మిక కోడ్ల వల్ల జరగబోయే నష్టాలు, కనీస వేతనాల డిమాండ్‌పై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఆయన అధికార యావతో పాదయాత్ర చేస్తున్నాడు తప్ప ప్రజా సమస్యలపై కాదని విమర్శించారు. ఇంట్లో బండెడు చాకిరీ, కుటుంబ బాగోలు, పరిశ్రమలో పని,సాయంత్రమొచ్చి పిల్లల మంచీ చెడుచూసుకోవడం, వంట చేయడం వంటి పనులతో క్షణం తీరిక లేకుండా గడియారం ముల్లు తిరిగినట్టే శ్రామిక మహి ళల జీవితం సాగుతున్నదన్నారు. ఇంత చేసినా వారికి దక్కు తున్న జీతం రూ.10వేలకు మించడం లేదన్నారు. పరిశ్రమ లో కార్మికులు పొరపాటున వేతనం, సౌకర్యాల గురించి అడిగితే తీస్తేస్తున్నారనీ, దీంతో ఉద్యోగం పోతుందనే భయంతో నోరు మూసుకుని పని చేస్తున్న పరిస్థితి నేడు రాష్ట్రంలో ఉందని వివరించారు. వలస కార్మికుల బతుకులు మరీ దుర్భంగా ఉన్నాయన్నారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జయలక్ష్మి మాట్లాడుతూ.. మోడీ సర్కారు తీసుకొచ్చిన కార్మిక కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సర్కారుపై పైసా భారం పడకున్నా 73 షెడ్యూల్డ్ పరిశ్రమల కనీస వేతనాల నిర్ణయం ఫైళ్లపై సంతకం పెట్టే తీరిక కూడా లేదా? అని ప్రశ్నించారు. యాజమాన్యాల పక్షం వహిస్తున్న పాలకులకు కార్మికులు తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి కమిటీ తరఫున పాదయాత్ర బృంద సభ్యులకు మెమెంటోలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి, పాదయాత్ర సమన్వయ కర్త జె.మల్లిఖార్జున్, రాష్ట్ర కార్యదర్శి ఎస్.రమ, కోశాధికారి వంగూరు రాములు, పట్నం రాష్ట్ర కార్యదర్శి డీజీ నర్సింహారావు, సీఐటీయూ ఏపీ కోశాధికారి ఏవీ నాగేశ్వరరావు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి జె.చంద్రశేఖర్, అధ్యక్షులు ఎ.అశోక్, సహాయ కార్యదర్శి జి.శ్రీను, లింగస్వామి, ఉపాధ్యక్షులు జె.వెంకన్న, పి.గణేశ్, కోశాధికారి ఎం.సబిత, బీవీ.సత్య నారాయణ, ఆయా కంపెనీల సీఐటీయూ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
నడవలేకున్నా.. నేను సైతమంటూ..
అతని పేరు ఎ.బసవపున్నయ్య. వయస్సు అరవై రెండేం డ్లకుపైనే. నడవలేకున్నా..తన ఒంట్లోని సత్తునంతా ఇంధ నంగా చేసుకుని ఒకటికాదు రెండుకాదు 15 కిలోమీటర్లకు పైగా నడిచాడు. కార్మికుల హక్కుల కోసం సీఐటీయూ తలపెట్టిన కార్మిక గర్జన పాదయాత్రలో నేను సైతమంటూ అడుగులో అడుగేసుకుంటూ ముందుకుసా గాడు. ఎక్కడా వెనక్కి తగ్గలేదు. అందరూ అయ్యో పాపం.. పెద్దమనిషీ నీకెందుకీ కష్టం అన్నా పట్టించుకోలేదు. కళాకారులున్న బస్సు ఎక్కండని చెప్పినా... బైకు మీద వెళ్దాం రండి అనిసీఐటీయూ స్థానిక నాయకులు అన్నా.. 'లేదు.. లేదు.. పాదయాత్ర బృందంతోనే నడుస్తా' అంటూ తన పంతం నెగ్గించుకున్నాడు. అసలు ఆయనకు అంత ఆసక్తి ఎందుకు అని పలుకరిస్తే 'కార్మికులకు జీతాలు పెంచాలని పాద యాత్ర చేస్తున్నారు. వారి పోరాటంలో న్యాయముంది. కార్మికులు మంచిగుంటనే మనమంతా బాగుంటాం కదా. అందుకే కార్మికుల హక్కుల కోసం జరుగుతున్న ఈ యాత్రలో పాలుపంచుకుంటున్నా. మహాజన పాదయాత్రలోనూ మూడు రోజులు నడిచా. ఇప్పుడు కార్మిక గర్జన పాదయాత్ర మా ప్రాంతానికొచ్చింది. కార్మికుల కోసం ఒక్కరోజు నడవలేనా?' అంటూ ఎదురు ప్రశ్నించాడు. 'మా కొడుకు సాఫ్ట్వేర్. బెంగుళూరులో జాబ్ చేస్తాడు. చాలా కాలం తర్వాత మా ఇంటికొచ్చాడు. అయినా, పాదయాత్ర వచ్చిందని తెలుసుకుని ఇక్కడికొచ్చా. సభ అయిపోనంక ఇంటికి పోయి కొడుకుని చూస్తా' అని చెప్పడం కొసమెరుపు.