Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రక్తం, వెంట్రుకలు పరీక్షకిస్తా.. రాహుల్ గాంధీ ఇస్తారా?
- పీసీసీని కొనుకున్నోడు..రేపు ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకోడా?
- అందరి బాగోతం మా దగ్గర ఉంది
- జానారెడ్డి కంటే ఈటల గొప్పోడా? : కేటీఆర్
నవతెలంగాణ-సిటీబ్యూరో
'డ్రగ్స్‌తో నాకేం సంబంధం. నా రక్తం, వెంట్రుకలు ఇస్తాను. నేను ఏ పరీక్షలకైనా సిద్ధం. రాహుల్ గాంధీ ఇస్తారా?. ఎవరో ఏదో చేస్తే నాకేం సంబంధం. ఈడీకి లెటర్ ఇచ్చిన వాడు బఫూన్. ఇక నుంచి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కేసులు పెడుతాం. అవసరమైతే రాజద్రోహం కేసులు కూడా పెడుతాం. అడ్రస్ లేని వ్యక్తులు కేసీఆర్‌ని తిడితే ఊరుకోం. ఉద్యమంలో కేసీఆర్ తిడితే ఆనాడు ఉద్వేగం ఉంది. ఇవాల వీళ్లకు ఏం రోగం. సింగరేణి కాలనీ బాలిక ఘటనపై చట్టం తన పని తాను చేసుకుంది. దిశ ఘటనపై తీసుకున్న చర్యలపై దేశం హర్షించింది. నాకు కూతురు ఉంది.. కన్నీళ్లు పెట్టుకున్నాం. ఒకప్పుడు సున్నాలు వేసిన వ్యక్తి ఇవాల కన్నాలు వేస్తు న్నట్టు బయట ప్రచారం జరుగుతోంది. క్రిమినల్స్‌కు చార్జిషీట్స్ మాత్రమే తెలుసు.. రోజూ కోర్టుల చుట్టూ తిరిగే వాళ్లు మాత్రమే చార్జిషీట్లు అంటరు. జానారెడ్డి కంటే ఈటల రాజేందర్ పెద్దవాడు కాదు కదా! బండి సంజరుకి ఓట్లు వేసిన ప్రజలు బాధపడుతున్నారు. మతం పేరుతో చిల్లర డ్రామాలు మాకు రావు' అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం తెలంగాణ భవన్లో మీడియాతో కేటీఆర్ చిట్ చాట్ చేశారు. తెలంగాణకు 2వేలకోట్ల పెట్టుబడులు రాబోతున్నాయన్నారు. 'నిన్నగాక మొన్న వచ్చిన ఒకాయనమార్కెట్లో నేనున్నానని చూపుకుంటు న్నారు. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ కచ్చితంగా గెలుస్తుంది. జానారెడ్డి సు దీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి.. చిన్న పిలగాని చేతిలోఓడిపోయాడు. రాష్ట్రంలో ఎక్కడైనా సభలు పెట్టుకోవచ్చు. హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌కి డిపాజిట్లు వస్తాయా? కొత్తగా కాంగ్రెస్‌లో రియల్ ఎస్టేట్ భూమ్ వచ్చింది. 50కోట్లకు ఠాకూర్ పీసీసీ అమ్మారని అప్పట్లో వాళ్లేవిమర్శలు చేసుకున్నారు. పీసీసీ కొనుకున్నోడు..రేపు ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకోడా? రాష్ట్రం గురించి ఒక ఎంపీ మాట్లాడితే అతన్ని గాడిద అంటావా? వంటేరు ప్రతాప్‌రెడ్డి అప్ప ట్లో ఇంతకంటే గొప్పగా సభలు పెట్టారు. ప్రజలు చాలా చైతన్యవంతులు ఎవరికి ఓట్లు వెయ్యలో వాళ్లకు తెలుసు. తెలంగాణలో మజ్లీస్ పార్టీకి ఎవ రూ భయపడటం లేదు. బీజేపీ భయపడుతోంది. బీజేపీ ఆదిలాబాద్‌కి ట్రై బల్ యూనివర్సిటీ ఇస్తామంది.. ఇచ్చిందా? సాయుధ పోరాటం చేసిన నేత లకు పెన్షన్స్ ఇవ్వమంటే కేంద్రం ఇవ్వడం లేదు అమిత్‌షా రాష్ట్రానికి వచ్చి తెలంగాణకు కేంద్రం ఏం ఇచ్చిం దో చెప్పారా? కాంగ్రెస్-బీజేపీలపై షర్మిల, ప్రవీణ్‌కుమార్ ఎందుకు మాట్లా డరు? టీఆర్ఎస్ ప్రజలకు లైఫ్లైన్ఆఫ్ తెలంగాణ' అని కేటీఆర్అన్నారు. సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో పడుకుంటేనే దేశంలో ఎక్కడా లేని ప్రథకాలు అమలు అవుతున్నాయా? తెలంగాణకు పెట్టుబడులు- అభివృద్ధి ఆగుతుందా? అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు చిల్లర మాటలు మాట్లాడుతు న్నారని విమర్శించారు. ఎవరినీ వదిలిపెట్టబోమని, గుడ్డలు ఊడదీస్తామని హెచ్చరించారు. పెయింటింగ్ వేసుకునే వ్యక్తికి జూబ్లీహిల్స్‌లో నాలుగు ఇండ్లు ఎట్లావచ్చాయని ప్రశ్నించారు. అందరి భాగోతం తమదగ్గర ఉందని, అన్నీ బయట పెడతామని చురకలంటించారు. బీసీబంధు కావాలంటున్న బండి సంజరు.. దేశంలో ఉన్న బీసీలకు-బలహీన వర్గాలకు లక్షలు లక్షలు పంచాలని మోడీకి చెప్పాలని సూచించారు.