Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగ్గురు మృతి, ఒకరి పరిస్థితి విషమం
నవతెలంగాణ-పదర
ఆర్టీసీ బస్సు, ఆటో ఢ కొని ముగ్గురు మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా పదర మండలం మద్దిమడుగు సమీపంలో ఆదివారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్దిమడుగు గ్రామ సమీపంలో దేవరకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆటోను ఢకొీట్టింది. దాంతో ఆటో డ్రైవర్ జానావత్ శ్రీను(30), ఆటోలో ప్రయాణిస్తున్న చందు నాయక్(60), జనవరి పోలీ(60) అక్కడికక్కడే మృతి చెందగా, రాజా, చంద్రకళ, బాల పరమేష్, సైదా, మరో ఐదేండ్ల బాబుకు తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో అచ్చంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. మృతదేహాలను అమ్రాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులను నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం జటావత్ తండాకు చెందిన వారిగా పోలీసులు ఆటో డ్రైవర్ శ్రీనుతో పాటు మరో కొంతమంది మద్దిమడుగు ఆంజనేయస్వామి దర్శనానికి వెళ్లి.. తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆటోలో మొత్తం ఎనిమిది మంది ఉన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు అమ్రాబాద్ సీఐ ఆదిరెడ్డి తెలిపారు.