Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అహ్మదాబాద్ : సుమారు తొమ్మిది వేల కోట్ల రూపాయల విలువైన 2,988.22 కిలోల హెరాయిన్‌ను గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో ఆదివారం డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డిఆర్ఐ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం నిఘా వర్గాల సమాచారంతో ముంద్రా పోర్టులో రెండు కంటైనర్లను తనిఖీ చేశారు. ఒక కంటైనర్‌లో 1999.58, మరో కంటైనర్‌లో 988.64 కిలోల హెరాయిన్‌ను గుర్తించారు. ఇద్దరిని అరెస్టు చేశామని, ఈ ర్యాకెట్లో ఉన్న మిగిలిన వారి పాత్రపై పరిశోధన చేస్తున్నామని అధికారులు తెలిపారు.
ఈ కంటైనర్లు టాల్కమ్ సెమీ ప్రోసెస్డ్ టాల్క్ స్టోన్స్‌గా ఆఫ్గనిస్థాన్ నుంచి బుక్ చేశారని, ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ పోర్టులో లోడ్ అయి, ముంద్రా పోర్టుకు చేరుకున్నాయని వివరించారు. ఇవి ఆంధ్ర ప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన ఒక ట్రేడింగ్ సంస్థకు చెందినవిగా గుర్తించామని తెలిపారు. గుజరాత్‌లోని గాంధీదామ్, మాండ్వి, అహ్మదా బాద్‌తోపాటు ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్‌లో సోదాలు నిర్వహిస్తున్నామన్నారు. ఆఫ్ఘన్ వాసుల పాత్రపైనా దర్యాప్తు చేస్తున్నామన్నారు.