Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్జీ ప్రధానోపాధ్యాయుల సంఘం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రధానోపాధ్యాయులపై మానసిక ఒత్తిడి లేకుండా ఎస్ఎంసీ నిధులు వినియోగించుకునేలా క్షేత్రస్థాయిలో సమస్యలను పరిగణనలోకి తీసుకొని నూతన మార్గదర్శకాలను ఇవ్వాలని తెలంగాణ స్టేట్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు పాఠశాల విద్య కమిషనర్ కు ఆ సంఘం అధ్యక్షులు పి. రాజ భాను చంద్ర ప్రకాశ్, ప్రధాన కార్యదర్శి ఆర్.రాజగంగారెడ్డి, కోశాధికారి ఎస్.గిరిధర్ లేఖ రాశారు. సమగ్రశిక్ష నుంచి నిధులను ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో కాకుండా ముగింపు క్వార్టర్ లో మంజూరు చేస్తున్నందున ప్రధానోపాధ్యాయులు పాఠశాల అవసరాల కొరకు తమ సొంత డబ్బులు ఖర్చు చేయవలసిన అవసరం ఏర్పడుతుందని తెలిపారు. ఫలితంగా ప్రధానోపాధ్యాయులు వెచ్చించిన డబ్బులను వారు సెల్ఫ్ చెక్ ద్వారా ఎస్ఎంసి ఖాతా నుంచి తీసుకుంటున్నారని వివరించారు. కూలీలకు చెల్లింపులు, ప్లంబర్, ఎలక్ట్రీషియన్, ఫర్నిచర్ రిపేర్ వంటి పనులలో క్షేత్రస్థాయిలో అకౌంట్ ద్వారా చెల్లించటం అన్ని సందర్భాల్లో సాధ్యం కాదని వివరించారు. ఎస్ఎంసీ నుంచి విత్ డ్రా చేశారని వివరణ కోరటం సమంజసంగా లేదని అభిప్రాయపడ్డారు.