Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆర్టీసీ బస్సులో వినాయకుడు నిమజ్జనానికి తరలివెళ్లాడు. టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ లక్డీకపూల్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని నిమజ్జనం నిమిత్తం ఆర్టీసీ బస్సులో తీసుకెళ్లారు.సాంప్రదాయ వస్త్రాలు ధరించి, కుటుంబ సమేతంగా ఆర్టీసీ బస్సులో లక్డీకపూల్ నుంచి తార్నాక ఆర్టీసీ ఆస్పత్రికి వెళ్లారు. ఆస్పత్రి ప్రాంగణంలోని పురాతన బావిలో విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. సజ్జనార్ చేసిన పనికి నెటిజన్లు ట్విట్టర్లో ఫిదా అయ్యారు. ఆయనపై ప్రసంసల వర్షం కురిపించారు. ఆర్టీసీ బస్సులో వెళ్లి నిమజ్జనం చేయోచ్చనే కొత్త ఒరవడిని ఆయన సృష్టించారని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.