Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అర్ధ గంట వ్యవధిలో రెండు రోడ్డు ప్రమాదాలు
- ఐదుగురు దుర్మరణం
- కట్టంగూరు మండలం ముత్యాలమ్మ గూడెంవద్ద ఘటన
నవతెలంగాణ-కట్టంగూర్
65వ జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం అర్థగంట వ్యవధిలో రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం ముత్యాలమ్మగూడెం వద్ద జరిగిన ఈ ఘటనల్లో ఐదుగురు దుర్మరణం చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం అయ్యపురాజుపాలెంకు చెందిన దంపతులు కదిరి గోపాల్ రెడ్డి (31) రాజస్థాన్‌లో మైనింగ్‌శాఖలో ఉద్యోగం చేస్తున్నారు. దక్షిణాఫ్రికాలో ఉద్యోగం రావడంతో తన ఉద్యోగానికి రాజీనామా చేసి భార్య రచన (30) కూతురు రియాన్సితో కలిసి హైదరాబాద్‌లోని తన స్నేహితుడు ప్రశాంత్ దగ్గరికి వచ్చారు. వీరంతా హైదరాబాద్ నుంచి నూజివీడుకు కారులో బయలుదేరారు. కట్టంగూరు మండలం ముత్యాలమ్మ గూడెం గ్రామ శివారుకు రాగానే విజయవాడ వైపు వెళుతున్న ఎస్సార్ఎంటీ పార్సెల్ లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో అతివేగంగా లారీ వెనుక భాగాన్ని కారు గట్టిగా ఢకొీట్టింది. దాంతో కారు అదుపు తప్పి రహదారి మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢ కొట్టి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢకొీన్నది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న ప్రశాంత్‌తో పాటు గోపాల్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలై కారులో ఉన్న రచనతో పాటు కూతురు రియాన్సీలను నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో రచన మృతిచెందింది. తల్లిదండ్రులను కోల్పోయిన రియాన్ష్ స్వల్పగాయాలతో బయటపడింది. ప్రమాదంలో కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను పోలీసులు జేసీబీ సహాయంతో తీస్తుండగా జాతీయ రహదారిపై అర కిలోమీటర్ మేర ట్రాఫిక్ స్తంభించింది. ఇదే సమయంలో హైదరాబాద్‌లోని హయత్‌నగర్ నుంచి షిఫ్ట్ కార్లో పురోహితులు జంగం శివప్రసాద్ (23), రోమాల వినరుకుమార్(21)సూర్యాపేటలోని సత్యసాయి సేవా సమితిలో జరిగే రుద్రాభిషేకం కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరారు. మార్గమధ్యంలో ముత్యాలమ్మ గూడెం, పామనగుండ్ల గ్రామాల మధ్య ట్రాఫిక్ నిలిచిపోవడంతో వారి కారు ముందున్న సిమెంటు లారీని అతి వేగంగా ఢకొీట్టిం ది.దాంతో కారులో ఉన్న ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.మృతులు ఇద్దరు అవివాహి తులు.మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్ల అతివేగమే ప్రమాదానికి కారణమని శాలిగౌరారం రూరల్ సీఐ నాగ దుర్గాప్రసాద్, కట్టంగూర్ ఎస్ఐ శివప్రసాద్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు చెప్పారు.