Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వి.హనుమంతరావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బీసీ అమ్మాయిలపై లైంగికదాడి, హత్య జరిగినా టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని వి.హనుమంతరావు విమర్శించారు. గాంధీభవన్ లో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హాజీపూర్ ఘటనలో బలహీనవర్గాలకు చెందిన ముగ్గురు అమ్మాయిలపై శ్రీనివాస్ రెడ్డి లైంగికదాడి జరిపి, హత్య చేస్తే ప్రభుత్వం చర్యలు తీసుకోలేదన్నారు. దేశంలో బాలికలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణి బాలిక, మరియమ్మ లాకప్ డెత్ సందర్భాల్లో ప్రభుత్వం ఆదుకుందనీ, అది సర్కారు బాధ్యత అని తెలిపారు. అదే హాజీపూర్ బీసీ అమ్మాయిల విషయంలో కోర్టు ఆదేశించాకే నిర్భయ ఫండ్ నుంచి పరిహారం ఇచ్చారని గుర్తుచేశారు. వారి విషయంలో కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు.