Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ అమలు కార్యాచరణపై గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) మరోమారు చర్చించింది. జీఆర్ఎంబీ సభ్యకార్యదర్శి బీపీ పాండే నేతృత్వంలో జరిగిన సమావేశంలో బోర్డు సభ్యులు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధికారులు పాల్గొన్నారు. శుక్రవారం నాటి సమావేశానికి కొనసాగింపుగా ఈ భేటీ జరిగింది. ప్రాజెక్టులు, పంప్ హౌజులు, ప్లాంట్లకు సంబంధించిన ఉద్యోగులు, సిబ్బంది వివరాలు వీలైనంత త్వరగా ఇవ్వాలని రెండు రాష్ట్రాలను ఉపసంఘం కోరింది. అక్టోబర్ 14వ తేదీ నుంచి గెజిట్ నోటిఫికేషన్ అమలు చేయాల్సి ఉన్నందున వీలైనంత త్వరగా వివరాలు అందించాలని సూచించింది.