Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యువ ఇన్నోవేషన్ ప్రారంభం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
యువతరంలోని నైపుణ్యాలను వెలికితీసి, వారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉన్నదని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కె తారకరామారావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, యునిసెఫ్, యువా, ఇంక్వి-ల్యాబ్ ఫౌండేషన్ సహకారంతో సోమవారం తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్-2021ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ యువతలో డిజైన్ థింకింగ్,ఇన్నోవేషన్, ఎంటర్ప్రెన్యూర్ మైండ్‌సెట్‌లను పెంపొందించే దిశగా ఇంక్వి-ల్యాబ్ ఫౌండేషన్ గతేడాది తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్‌ను ప్రారంభించిందనీ,ఇప్పుడు రెండో విడత ఛాలెంజ్‌ను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు.ఈ సందర్బంగా మంత్రి పోస్టర్‌ను ఆవిష్కరించారు. Ûకార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్,రాష్ట్ర చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ శాంటా తౌతం యునిసెఫ్ ప్రాంతీయ అధికారి జాన్ బీ ట్రూ తదితరులు పాల్గొన్నారు.