Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న పార్ట్‌టైం అధ్యాపకులు, మినిమం టైంస్కేల్ అధ్యాపకుల జీతాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు జూన్, జులై, ఆగస్టు మూడు నెలల జీతాలకు సంబంధించి రూ.2.12 కోట్లను ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ సోమవారం విడుదల చేశారు. వారి జీతాలు చెల్లించాలని డీఐఈవో, నోడల్ అధికారులను ఆదేశించారు.