Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రైతు వ్యతిరేక మూడు వ్యవసాయ చట్టాలను, విద్యుత్ సవరణ బిల్లును, లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఈనెల 27న తలపెట్టిన భారత్‌బంద్‌కు భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలనీ, దేశంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోడీ ప్రభుత్వం హామీ ఇచ్చిందనీ, అధికారంలోకి వచ్చాక ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటుపరం చేస్తూ ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నదని విమర్శించారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను పెంచి ప్రజలపై భారాలు మోపుతున్నదని తెలిపారు.