Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని క్లస్టర్ డిగ్రీ కాలేజీల్లో 2021-22 విద్యాసంవత్సరంలో మూడేండ్ల బీఏ హానర్స్ కోర్సును ప్రవేశపెట్టాలని ఉన్నత విద్యామండలి, ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) నిర్ణయించాయి. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మెన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ఓయూ వీసీ డి రవీందర్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో తొమ్మిది డిగ్రీ కాలేజీల్లో క్లస్టర్ విధానం ఎంపికైన విషయం తెలిసిందే. మంగళవారం హైదరాబాద్‌లోని కోఠి మహిళా కాలేజీలో ఈ కోర్సును రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్‌కుమార్ ప్రారంభిస్తారని తెలిపారు.