Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భార్యాభర్తల మధ్య గొడవే కారణం..
నవతెలంగాణ -బల్మూరు
భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగి.. భార్య ఆత్మహత్యాయత్నం చేసుకోవడంతో.. ఆమె తమ్ముళ్లు(బామ్మర్దుల) బావపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన బావ సోమవారం మృతిచెందాడు. బల్మూర్ ఎస్ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా బల్మూర్ మండలంలోని కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన పంబ మల్లయ్య(45), భార్య పుష్ప మూడ్రోజుల కిందట గొడవ పడ్డారు. దీంతో పుష్ప పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. వెంటనే ఆస్పత్రికి తరలించడంతో ప్రమాదం తప్పింది. ఈ విషయం తెలుసుకున్న పుష్ప తమ్ముళ్లు గణేష్, శంకర్, కురుమ ఆదివారం సాయంత్రం కొండారెడ్డిపల్లికి వంచ్చి బావ మల్లయ్యను మందలించి ఇంటి నుంచి బయటికి తీసుకువెళ్లారు. అనంతరం అతన్ని తీవ్రంగా కొట్టారు. పంబ మల్లయ్యను అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ అస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మల్లయ్య మృతిచెందాడు. ఇతనికి ఇద్దరు కుమారులున్నారు. మల్లయ్య సోదరుని ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు బల్మూర్ ఎస్ఐ రాజు తెలిపారు.