Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసి సరైన ఉద్యోగం లేక కుటుంబపోషణ కోసం జీహెచ్ఎంసీలో స్వీపర్‌గా పనిచేస్తున్న రజిని అనే మహిళకు అసిస్టెంట్ ఎంటమాలజిస్ట్ (ఔట్సోర్సింగ్) ఉద్యోగాన్ని పురపాలక మంత్రి కేటీఆర్ కల్పించారు. ఇద్దరు కూతుళ్లున్న రజినీ పరిస్థితిపై మీడియాలో వచ్చిన కథనంపై మంత్రి వెంటనే స్పందించారు. కేటీఆర్ సోమవారం తన కార్యాలయానికి పిలిపించుకుని మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ సమక్షంలో రజినికీ ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేశారు.