Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం
- మెదక్ జిల్లా చిత్కుల్లో 14 సెంటీమీటర్ల వర్షం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఇంటీరియల్ కర్నాటక నుంచి ఇంటీరియల్ తమిళనాడు మీదుగా కోమరిన్ తీరం వరకు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరిత ద్రోణి నెలకొనటం, పశ్చిమబెంగాల్, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడటం వల్ల రాష్ట్రంలో వచ్చే రెండు రోజులు మోస్తరు వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి నాగరత్న తెలిపారు. అక్కడక్కడా భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని తెలిపారు. మెదక్ జిల్లా చిలిప్చేడ్ మండలం చిత్కుల్ పరిధిలో అత్యధికంగా 14.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్పేట మండలం హలియాబాద్లో 12.1 సెంటీమీటర్ల వాన పడింది. రాష్ట్రంలోని 602 ప్రాంతాల్లో వర్షపాతం రికార్డయింది. అందులో 16 చోట్ల భారీ వర్షం, 241 ప్రాంతాల్లో మోస్తరు వాన కురిసింది.