Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశంలోనే అత్యుత్తమమైన క్రీడా విధానాన్ని ప్రకటించటానికి కసరత్తు చేస్తున్నామని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల క్రీడాశాఖ మంత్రులతో సోమవారం నిర్వహించిన వర్చువల్ సమావేశంలో శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వివిధ దేశాల క్రీడా పాలసీలను అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. క్రీడాకారులకు ఉద్యోగాల్లో రెండు శాతంతోపాటు ఉన్నత విద్యలో 0.5 శాతం రిజర్వేషన్లు ప్రవేశపెట్టామని గుర్తుచేశారు. మెదక్, కరీంనగర్, వరంగల్‌లో 400 మీటర్ల సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్‌ను కేంద్ర క్రీడా శాఖ మంజూరు చేసినందుకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. మహబూబ్ నగర్లో సింథటిక్ ట్రాక్ నిర్మాణం కోసం రూ. 7. 50 కోట్లు, సిద్దిపేట లో మల్టీపర్పస్ స్టేడియం నిర్మాణం కోసం రూ. 10 కోట్లు ప్రాధాన్యత ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించామన్నారు. వీటితోపాటు అంతర్జాతీయ ప్రమాణాలైన ఆక్వాటిక్స్, బ్యాడ్మింటన్, రెండు సింథటిక్ ట్రాక్స్ , రెండు అస్ట్రోటర్ఫ్ హాకీ గ్రౌండ్లతో పాటు క్రీడా మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ. 52 కోట్లను మంజూరు చేయాలని కోరారు.