Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హౌసింగ్ బోర్డు, రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థల మధ్య ఒప్పందంపై వివాదం ఏర్పడితే అది విల్లాల కోసం డబ్బు కట్టినవాళ్లకు సమస్య కావొద్దని హైకోర్టు చెప్పింది. ఆ సంస్థల మధ్య విభేదాలను పరిష్కరించుకోవాలనీ, డబ్బు కట్టిన వాళ్లకు వారంలోగా విల్లాలు రిజిస్ట్రేషన్లు చేయాలని బోర్డును హైకోర్టు ఆదేశించింది. పిటిషనర్లకు రూ.10 వేల చొప్పున పరిహారం చెల్లించాలని బోర్డుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు, జస్టిస్ టి వినోద్‌కుమార్‌లతో కూడిన డివిజన్ బెంచ్ సోమవారం ఉత్తర్వులిచ్చింది.వరంగల్‌లోని హౌసింగ్ బోర్డు విల్లాల నిర్మాణానికి రాంకీతో ఒప్పందం చేసుకుందనీ, తాము డబ్బులు చెల్లించినా విల్లాలను బోర్డు రిజిస్ట్రేషన్లు చేయడం లేదని హైకోర్టులో రిట్లు దాఖలయ్యాయి. దీనిపై సింగిల్ జడ్జి గతంలో ఇచ్చిన తీర్పులో .వారం రోజుల్లో పిటిషనర్లకు విల్లాలను రిజిస్ట్రేషన్ చేసివ్వాలనీ, కోర్టు ఖర్చుల కింద రూ.10 వేలు పరిహారం చెల్లించాలని ఆదేశించారు. దీనిపై బోర్డు అప్పీల్ దాఖలు చేస్తే దీనిని డివిజన్ బెంచ్ సోమవారం విచారించింది. సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని బెంచ్ స్పష్టం చేసింది. బోర్డు అప్పీల్‌ను డిస్మిస్ చేసింది.