Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేధింపులు ఆపాలి :రాష్ట్ర వ్యాప్తంగా వ్యకాస ఆధ్వర్యంలో ధర్నాలు
- సీఎం మాట నిలబెట్టుకోవాలని డిమాండ్
నవతెలంగాణ- విలేకరులు
ఖమ్మం జిల్లా ఫారెస్టు ఆఫీసు ముందు ధర్నాలో వ్యకాస రాష్ట్ర అధ్యక్షులు బుర్రి ప్రసాద్ మాట్లాడుతూ..రెవెన్యూ, ఫారెస్టు సరిహద్దు భూవివా దాలను పరిష్కరించడానికి రాష్ట్ర వ్యాపిత జాయింట్ సర్వేకు ఆదేశించాలన్నారు. కుర్చీవేసుకొని కూర్చొని పోడు సమస్యను పరిష్కరిస్తామన్న ముఖ్యమంత్రి హక్కు పత్రాలివ్వకుండా మోసం చేశారన్నారు.పోడు భూములు సాగుదారులపై నిర్బంధాన్ని ఆపాలని, సాగుదారులకు పట్టాలు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా ఫారెస్ట్ అధికారి కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఎన్నికల ముందు సీఎం ఇచ్చిన హామీ మేరకు సాగుదారులకు పట్టాలు ఇవ్వాలని, పోడు భూములు సాగు చేస్తున్న ఆదివాసీి, గిరిజన, దళితులపై నిర్బంధకాండ ఆపాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుడికందుల సత్యం డిమాండ్ చేశారు. అనంతరం సూపరింటెండెంట్ గౌస్కి వినతిపత్రం అందజేశారు. మహబూబ్నగర్ జిల్లాలో ఫారెస్ట్ భూములు సాగు చేసుకుంటున్న రైతుల సమస్యలు పరిష్కరించాలని ఫారెస్ట్ కార్యాలయం ముందు రైతులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఫారెస్ట్ ఆఫీసర్ వినతిపత్రం అందించారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయం ఎదుట గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి శంకర్ నాయక్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎస్ మల్లేష్ ఆధ్వర్యంలో గిరిజనులు, ఆదివాసీలు ధర్నా చేశారు. అనంతరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అశోక్ కుమార్కు వినతిపత్రం ఇచ్చారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా, అనంతరం జిల్లా డీఎఫ్ఓ రామకృష్ణకు వినతి పత్రం అందజేశారు.ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లోని అటవీశాఖ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించారు. అటవీశాఖ అధికారులకు వినతిపత్రం అందజేశారు. హనుమకొండలోని జిల్లా అటవీ శాఖ కార్యాలయం ఎదుట పోడు సాగుదారులు ధర్నా చేశారు. అనంతరం వ్యకాస జిల్లా కార్యదర్శి గుమ్మడి రాజుల రాములు ఆధ్వర్యంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. నర్పంపేటలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఫారెస్టు అధికారులకు వినతిపత్రం అందజేశారు.