Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రాజకీయ దురుద్దేశంతో, తనపై అసత్యాలను, అబద్ధాలను ప్రచా రం చేస్తున్నారని పేర్కొంటూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ హైదరా బాద్‌లోని సివిల్‌కోర్టులో సోమ వారం పరువు నష్టం కేసును దాఖలు చేశారు. గత కొంత కాలంగా రేవంత్‌రెడ్డి తనపైన అసత్య ప్రచారాన్ని కొనసాగిస్తున్నారని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిర్వహి స్తున్న విచారణకు హాజరవుతున్న వ్యక్తులతోగానీ, ఆయా కేసులతోగాని తనకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అయినా రేవంత్ దురుద్దేశపూర్వకంగా తన పేరును వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ అంశానికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కేటీఆర్ కోర్టులో కేసు దాఖలు చేశారు. ఇలాంటి దుష్ప్రచారం వల్ల కలిగిన పరువు నష్టానికి తగిన పరిహారం చెల్లించడంతోపాటు క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ని సైతం ప్రారంభించాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. 'గౌరవ న్యాయస్థానం తనపై రేవంత్ చేస్తున్న అసత్య ప్రచారాలను గుర్తించి, ఇలాంటి దురుద్దేశ కార్యక్రమాలకు పాల్పడుతున్న నిందితులను తగిన విధంగా శిక్షిస్తుందనే విశ్వాసం నాకుంది...' అని కేటీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.