Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ప్రముఖ కళాకారులైన గుస్సాడీ కనకరాజ్, దర్శనం మొగిలయ్య, భరత్ భూషణ్‌లకు నెలకు పదివేల ఆర్థిక సహాయం అందించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన మేరకు 2021 జూన్ మాసం నుండి క్రమం తప్పకుండా నగదు మొత్తాన్ని రాష్ట్ర సాంస్కతిక శాఖ వెల్లడించింది. ఈ ముగ్గురు కళాకారులకు ప్రత్యేకంగా జీవితాంతం నెలకు రూ 10 వేలను అందిస్తున్నట్టు సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికష్ణ తెలిపారు.
ఆత్మగౌరవ ప్రతీక కొండా లక్ష్మణ్ : గంగుల కమలాకర్
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అని మంత్రి గంగుల కమలాకర్, బీసీ కమిషన్ చైర్మెన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు అన్నారు. ఈమేరకు హైదరాబాద్‌లో మంగళవారం 9వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలదండలేసి, ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు సిహెచ్ ఉపేంద్ర, శుభప్రద్ పటేల్ నూలి, కె కిషోర్గౌడ్లతోపాటు బిసి సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్రా వెంకటేశం ఉన్నారు. శాసన మండలి ప్రాంగణంలోని చైర్మన్ గారి ఛాంబర్ లో మీడియా మిత్రులతో చిట్ చాట్ కార్యక్రమం నిర్వహించిన తెలంగాణ శాసన మండలి ప్రొటెం చైర్మన్ శ్రీ వెన్నవరం భూపాల్ రెడ్డి గారు
అందరికి అవకాశం కల్పిస్తాం :శాసనమండలి ప్రొటెం చైర్మెన్
శాసనమండలిలో అందరికీ మాట్లాడే అవకాశం కల్పిస్తామని ప్రొటెం చైర్మెన్ భూపాల్‌రెడ్డి వెల్లడించారు. మంగళవారం మండలిలోని తన చాంబర్లో ఇష్టాగోష్టిలో మాట్లాడారు. ఈనెల 24 నుంచి జరగనున్న శాసన మండలి సమావేశాలను విజయవంతంగా నిర్వహిస్తామని చెప్పారు. సభను విజయవంతంగా నడపాలి అంటే సభ్యుల సహకారం కావాలని కోరారు.