Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆవిష్కరించిన లింబాద్రి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
డిగ్రీ ఫైనలియర్ విద్యార్థులకు ద్వితీయ భాష తెలుగును అమలు చేయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఈ మేరకు 'సాహితీ దుందుభి' అనే తెలుగు పుస్తకాన్ని ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో రచనా నైపుణ్యాలను పెంచేందుకు పాఠ్యప్రణాళికను రూపొందించారని చెప్పారు. తెలుగు చదివే విద్యార్థులందరూ ఈ పుస్తకాన్ని చదివి ఆ నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు. సరళంగా మాట్లాడ్డం, రాయడం నేర్చుకున్నపుడే ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని విద్యార్థుల్లో మానవీయ, సామాజిక విలువలను పెంపొందించాలని కోరారు. ఉన్నత విద్యామండలి చైర్మెన్ వి వెంకటరమణ, సాహితీ దుందుభి ప్రధాన సంపాదకులు సూర్యాధనుంజరు, రచయితలు కాశీం, లావణ్య, ఎస్ రఘు, వెల్దండి శ్రీధర్, శంకర్, కృష్ణయ్య, తెలుగు అకాడమి ప్రతినిధి భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు.