Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి జగదీశ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశానికే తెలంగాణ విద్య మార్గదర్శనం కావాలని మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆకాంక్షించారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయనను మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్‌తోపాటు పీఆర్టీయూటీఎస్ నల్లగొండ జిల్లా నూతన కమిటీ కలిసింది. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ కరోనా వల్ల విద్యారంగంపై ప్రభావం పడిందని చెప్పారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో విద్యారంగం బలోపేతం అవుతున్నదని వివరించారు. గురుకులాల ద్వారా అందిస్తున్న విద్య అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నదని అన్నారు. విద్యార్థులకు బోధిస్తున్న ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని చెప్పారు. నూతన కమిటీ నాయకులను ఆయన అభినందించారు. నూతన అధ్యక్షులు సుంకరి బిక్షంగౌడ్, ప్రధాన కార్యదర్శి కాళం నారాయణరెడ్డి, మాజీ ప్రధాన కార్యదర్శులు ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, కోమటిరెడ్డి నరసింహారెడ్డి, భసిరెడ్డి రవీందర్‌రెడ్డి, ఫణికుమార్, మేకల జానారెడ్డి, జెవి గౌడ్, యూసుఫ్, రమణ తదితరులు పాల్గొన్నారు.