Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో 36 కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ)ను ప్రభుత్వం జూనియర్ కాలేజీలుగా ఉన్నతీకరించింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా మంగళవారం ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రస్తుత విద్యాసంవత్సరం (2021-22) నుంచే ఈ కేజీబీవీల్లో ఇంటర్ విద్య అందుబాటులోకి వస్తుందని తెలిపారు. 2021-22 విద్యాసంవత్సరంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం, 2022-23 విద్యాసంవత్సరం ద్వితీయ సంవత్సరం తరగతులు జరుగుతాయని వివరించారు. వాటిలో తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఒక్కో కోర్సుల్లో 40 సీట్లుంటాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో 475 కేజీబీవీలున్నాయి. వాటిలో ఇప్పటికే 172 కేజీబీవీలు ఇంటర్మీడియెట్ స్థాయి వరకు ప్రభుత్వం ఉన్నతీకరించింది. ప్రస్తుతం 36 కేజీబీవీలను జూనియర్ కాలేజీలుగా ఉన్నతీకరించడంతో వాటి సంఖ్య 208కి చేరింది.