Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ప్రతి జోనల్ పరిధిలో రెండు డైట్ కాలేజీలుండాలని తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ హెడ్మాస్టర్ల సంఘం (టీఎస్జీహెచ్ఎంఏ) ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి కెటి రామారావును మంగళవారం హైదరాబాద్లో ఆ సంఘం అధ్యక్షులు పి రాజభాను చంద్రప్రకాశ్, ప్రధాన కార్యదర్శి ఆర్ రాజగంగారెడ్డి, కోశాధికారి ఎస్ గిరిధర్ కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో పది జిల్లాలున్నపుడు జిల్లాకో డైట్ కాలేజీ ఉండేదని గుర్తు చేశారు. 33 జిల్లాలుగా విభజించిన తర్వాత 23 జిల్లాల్లో డైట్ కాలేజీల్లేవని తెలిపారు.