Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్తర్వులు జారీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ఏ-4 కేటగిరీలో లిక్కర్ షాపుల కేటాయింపుల్లో గౌడ కులస్థులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, షెడ్యూల్డు తెగలకు ఐదు శాతం రిజర్వేషన్లను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయం మేరకు జీవో 87ను విడుదల చేసింది. తెలంగాణ ఎక్సైజ్ చట్టం 1968లోని సెక్షన్ 17 (1)( V) ప్రకారం ఏ-4 రిటైల్ షాపుల లైసెన్సులను 2021-23 సంవత్సరం కోసం రిజర్వేషన్లను కేటాయిస్తున్నట్టు సర్కారు ఉత్తర్వులో పేర్కొంది. జీవోపై తగు చర్యలు తీసుకోవాలని ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్‌ను ఆదేశించింది.