Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 26న జిల్లా, డివిజన్ కేంద్రాల్లో సంఘీభావ ర్యాలీలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలనీ, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత రైతుల పోరాట సమన్వయ కమిటీ సోమవారం తలపెట్టిన భారత్ బంద్కు తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్, కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్యవేదిక సంపూర్ణ మద్దతు ప్రకటించింది. బంద్కు మద్దతుగా ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా, డివిజన్ కేంద్రాల్లో ప్రదర్శనలు, వాహన ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం రైతులతోపాటు అన్ని వర్గాల ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నది. పెట్రోల్, గ్యాస్ ధరలను నియంత్రించలేకపోవడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు అదుపులేకుండా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తూ, దాన్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్నది. ప్రభుత్వ రంగం పతనం వల్ల ఆ రంగంలో ఉద్యోగాల సంఖ్య తగ్గిపోయి సామాజిక న్యాయానికి విఘాతం కలుగుతుంది. జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చి విద్యారంగంలో కేంద్రీకరణ, కార్పోరేటీకరణ, కాషాయీకరణకు పూనుకుంటున్నది. రాజ్యాంగ విలువలను కాలరాస్తున్నది. ఈ నేపద్యంలో రైతులు చేస్తున్న బందుకు ఐక్యవేదిక సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్టు ఉద్యోగులందరూ ఆదివారం జరిగే ర్యాలీల్లో పాల్గొనాలనీ, రైతుల ఉద్యమానికి మద్దతు తెలపాలని స్టీరింగ్ కమిటీ నాయకులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.