Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో మరింత మెరుగైన వైద్య, ఆరోగ్య సదుపాయాలను కల్పించేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ఆ ప్రతిపాదనలు 15 వ ఆర్థిక సంఘానికి పంపేలా ఉండాలని చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ తరపున పంపే ప్రతిపాదనలపై మంగళవారంనాడాయన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆరోగ్య ఉపకేంద్రాలను పటిష్ట పర్చడంతో పాటు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో కొన్నింటిని మండల పబ్లిక్ హెల్త్ యూనిట్‌గా అభివద్ధి చేయాలని సూచించారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకష్ణారావు, పంచాయతీ రాజ్, గ్రామీణాభివద్ధి శాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, మున్సిపల్ శాఖ కమిషనర్ డాక్టర్ సత్యనారాయణ, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వాకాటి కరుణ, వైద్య శాఖ సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు, వైద్య విద్యాశాఖ సంచాలకులు రమేష్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయం ఓఎస్డీ గంగాధర్ పాల్గొన్నారు.