Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ- మహబూబ్నగర్ ప్రాంతీయ ప్రతినిధి /పాన్గల్
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని, కార్పొరేటు శక్తులకు కొమ్ముకాస్తున్న బీజేపీ పాలనను అంతం చేయడానికి ఐక్య ఉద్యమాలు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్య దర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా పాన్గల్ మండలం రేముద్దుల గ్రామం లో అమరవీరుల స్థూపావిష్కరణకు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజా ఉద్యమం ద్వారానే ప్రజాసమస్యలు పరిష్కా రం అవుతాయన్నారు. కేంద్రంలో బీజేపీ పాలనలో ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు. ప్రజావ్యతిరేక విధానాలను అవలంబించడం వల్ల ప్రజలపై అధిక భారాలు మోపుతోందన్నారు.ప్రభుత్వ సంస్థలను,ప్రయివేట్ పరం చేస్తున్న బీజేపీ పాలకులను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. రైతుల సమస్యలపై నిలదీస్తే దేశ ద్రోహం కేసులు పెట్టి జైలుపాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి పేరుతో కార్పొరేట్ శక్తుల ను బతికించడానికి.. ప్రభుత్వ రంగ సంస్థలను గంప గుత్తగా అమ్మకానికి పెడుతోందని విమర్శించారు. వామపక్షాలు అనేక ఉద్యమాల వల్ల కేంద్రంలో ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ ఆ చట్టాన్ని నిర్వీ ర్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.అటవీ హక్కుల చట్టం అమలు చేయకుండా కుట్రలు పన్ను తున్నారన్నారు.దీంతో కేంద్ర ప్రభుత్వం ఆదివాసీల పొట్టలు కొడుతోందన్నారు. మతం రంగు పులిమేం దుకు నూతన విద్యా చట్టాన్ని తీసుకొస్తుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం బాటలో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనను అంతం చేయడానికి 27న భారత్ బంద్, 22న చేపట్టే సమ్మెలను జయప్రదం చేయాలని కోరారు. అక్టోబర్ 5న పోడు భూముల సమస్యలపై ఉద్యమాన్ని నిర్వహిస్తామని, ప్రభుత్వాలు ఇచ్చిన హామీని అమలు చేసేదాకా పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు.
ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలి :వెంకట్
అమరవీరుల సాక్షిగా ఎర్రజెండా ఉద్యమాన్ని ముం దుకు తీసుకుపోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి.వెంకట్ కార్యకర్తలకు సూచించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ పాలనలో నిత్యావసర ధరలు పెరిగిపోయన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లేక తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నా రని ఆవేదన వ్యక్తం చేశారు. పోడు భూముల సమస్య పరిష్కారం కోసం మరో ఉద్యమాన్ని చేపడతామన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు గోపాల్, జిల్లా కార్యదర్శి ఎండి జబ్బార్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బాల్రెడ్డి, పుట్ట ఆంజనేయులు, మేకల ఆంజనేయులు, నాయకులు దేవేందర్, రాజు, వేణుగోపాల్, ఎం వెంకటయ్య, జమలయ్య, బాల్య నాయక్ పాల్గొన్నారు.