Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఏచూరి హాజరు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు బుధవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా చేపట్టనున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి హాజరవుతారు. బుధవారం ఉదయం 11 గంటలను ప్రారంభ మయ్యే ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐ(ఎంఎల్) న్యూడె మోక్రసీ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్, తెలంగాణ జనసమితి (టీజేఎస్), తెలంగాణ ఇంటిపార్టీ నేతలు పాల్గొం టారు. నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలనీ, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల పెంపును ఉపసంహరించాలని ఆయా పార్టీలు డిమాండ్ చేస్తు న్నాయి. దేశంలో అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని కోరుతున్నాయి. కోవిడ్‌తో మరణించిన కుటుంబాలను ఆదుకోవాలని సూచిస్తున్నాయి. ఆదా యపు పన్ను పరిధిలో లేని ప్రతి కుటుంబానికీ నెలకు రూ.7,500 నగదు అందించాలనీ, ఒక్కొక్కరికీ 10 కిలోల బియ్యం ఇవ్వాలని కోరుతున్నాయి. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనీ, ఉత్పత్తి వ్యయంలో 50 శాతం మిగులు ఉండేలా మద్దతు ధరకు అమ్ముకునే హక్కు కల్పిస్తూ చట్టం చేయాలి డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వరంగ పరిశ్రమల ప్రయివేటీకరణ ను, మానిటైజేషన్ ప్రక్రియను ఆపాలనీ, మూసివేసిన పరిశ్ర మలను తెరవాలని కోరుతున్నాయి. కార్మిక కోడ్లను రద్దు చేయాలనీ, సమ్మెహక్కు ను, వేతనాల కోసం బేరసారాల హక్కులను పునరుద్ధరించాలని వివరించా యి. గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో 200 పనిదినాలు గ్యారెంటీ చేయాల నీ, వేతనాన్ని రెట్టింపు చేయాలనీ, పట్టణాలకూ విస్తరింపజేయాలని కోరుతున్నాయి. అటవీ హక్కుల చట్టం, పీసా చట్టాలను అమలు జరపాల నీ, పోడు భూములకు సాగు హక్కు పత్రాలివ్వాలని డిమాండ్ చేస్తున్నాయి.