Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లేదంటే ఐక్యఉద్యమాలు: వంగూరు రాములు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వీఆర్ఏలకు పే స్కేల్ జీవోను విడుదల చేయాలని వీఆర్ఏల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరు రాములు డిమాండ్ చేశారు. బుధవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ డైరెక్ట్ రిక్రూట్ మెంట్ విఆర్ఏ (టీడీఆర్ వీఆర్ఏ) అసోసియేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. రాములు మాట్లాడుతూ ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఇచ్చిన హామీని నిలబెట్టు
కోవాలని కోరారు. నూతన రెవెన్యూ చట్టం తెచ్చిన సందర్భంగా వీఆర్ఏల ను కొనసాగిస్తామనీ, సొంత గ్రామా ల్లోనే డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టించి ఇస్తామని సీఎం హామీ ఇచ్చారని గుర్తు చేశారు. సెప్టెంబర్ 24న అసెంబ్లీ సమావేశాలు ప్రారం భమయ్యేలోపు వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలనీ, లేదంటే వీఆర్ఏ సంఘాలు ఐక్యపోరా టానికి సిద్ధమవుతాయని హెచ్చరిం చారు. 25, 26 తేదీల్లో ఎమ్మెల్యేలు, మంత్రులకు వినతిపత్రాలు సమర్పిస్తామనీ, ఈ నెల చివరి నాటికి జీవోవిడుదల కాకపోతే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు. టీడీఆర్-వీఆర్ఏ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై.వెంకటేశం, కందుకూరి బాపుదేవ్, కోశాధికారి కోమండ్ల రాజు తదితరులు మాట్లాడుతూ 2012, 2014 సంవత్సరాల్లో నేరుగా నియామకమైనా ఇప్పటికీ చాలీచాలనీ జీతాలు, పదోన్నతులు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.