Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గవర్నర్‌కు బక్క జడ్సన్ ఫిర్యాదు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను రక్షించేందుకే ఎక్సైజ్‌శాఖ, రంగారెడ్డి జిల్లా కోర్టు సినీతారలకు క్లీన్చిట్ ఇచ్చిందంటూ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బక్క జడ్సన్ ఆరోపించారు.ఆయన్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇదే విషయమై బుధవారం ఈమేరకు ఆయన గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. విచారణ సంస్థలను అడ్డంపెట్టుకుని సినీ పరిశ్రమను తమ గుప్పిట్లో ఉంచుకునేందుకే ఆ కేసు మూసేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. డ్రగ్స్ కేసులో మంత్రి కేటీఆర్‌కు ప్రమేయం ఉందంటూ తాను ఫిర్యాదు చేయడంతో హడావుడి చేసిన ప్రభుత్వం..ఇవాళ వారికెందుకు క్లీన్చిట్ ఇచ్చాయని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్‌ను కాపాడేందుకు ఈ తతంగం చేస్తున్నారా? అని ప్రశ్నించారు. కేటీఆర్‌పై నేను ఫిర్యాదు చేసినందుకు నన్ను పిచ్చోడు, బఫున్ అంటూ నాపై రాజద్రోహం కేసు పెడతానంటూ బెదిరింపులకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ ఆయన రాజీనామా చేయడు కాబట్టి వెంటనే ఆయన్ను భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలావుండగా సినీనటులకు క్లీన్చిట్ ఇవ్వడంపై, కవిత అక్రమాస్తులపై వేర్వురుగా ఈడీకి తగిన ఆధారాలు సమర్పించినట్టు ఆయన పేర్కొన్నారు.