Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- అశ్వాపురం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతమ్మ సాగర్ ప్రాజెక్టు పరిధిలో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు న్యాయమైన ప్యాకేజీ ఇప్పించాలని కోరుతూ అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి గ్రామానికి చెందిన భూ నిర్వాసితులు బుధవారం హైదరాబాద్లో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రాన్ని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారి సమస్యలను వివరించారు. కొన్నేండ్లుగా సీతమ్మ సాగర్ బహుళార్థసాధక ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న వారు చేపడుతున్న ఆందోళన గురించి, అమ్మగారిపల్లి ప్రాంత రైతులకు జరుగుతున్న నష్టాలను వివరించారు. నిర్వాసిత రైతులకు న్యాయమైన ప్యాకేజీ ఇచ్చి ఇంటికో ఉద్యోగం ఇచ్చేలా చర్యలు చేపట్టాలని తమ్మినేనిని నిర్వాసితులు కోరారు. కలిసిన వారిలో.. నేలపట్ల పకీర్ రెడ్డి, నాగార్జున, నరసింహాచారితో పాటు సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, తదితరులున్నారు.