Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్టీసీపై సీఎం హెచ్చరిక
- వెల్లడించిన కొత్త చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మూడు నాలుగు నెలల్లో ఆర్టీసీ లాభాల బాట పట్టకుంటే సంస్థను ప్రయివేటీకరిస్తామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు హెచ్చరించినట్టు ఆ సంస్థ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్ చెప్పారు. ఆర్టీసీ, కరెంటు చార్జీల పెం పు ప్రతిపాదనలు పంపాలని మంగళవారం సీఎం నిర్వహించిన సమీక్షలో కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ చైర్మెన్ చెప్పిన మాటలకు ప్రాధాన్యత ఏర్పడింది. సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్ ఆర్టీసీ అధికారుల్ని తీవ్రంగా హెచ్చరించారనీ, ఇంకెంతకాలం ప్రభుత్వం ఆర్టీసీని అదుకోవాలని ప్రశ్నించారనీ తనను కలిసిన మీడియా ప్రతి నిధులతో చెప్పారు.
ఆర్టీసీ ప్రయివేటీకరణ జరిగితే ఉద్యోగులను ఎవరూ కాపాడలేరనీ, నెలవారీ జీతాలు ఉండబోవనీ హెచ్చరించారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి సంస్థను లాభాల్లోకి తెస్తేనే మనుగడ ఉంటుందని వ్యాఖ్యానిం చారు. చైర్మెన్ వ్యాఖ్యలపై టీఎమ్‌యూ అధ్యక్షులు తిరుపతి, ఎన్‌ఎమ్‌యూ అధ్యక్షులు కమాల్‌రెడ్డి తదితరులు స్పందించారు. ఆర్టీసీ గురించి చైర్మెన్‌కు ఏం తెలుసని వారు ప్రశ్నించారు. ప్రయివేటీకరణ చేసేందుకే ఆయన్ని సీఎం కేసీఆర్ నియమించారా.. అని అడిగారు. సంస్థ నష్టాలకు కార్మికులు కారణం కాదనీ, విధాన నిర్ణయాలే అవరోధమని చెప్పారు.