Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్‌పై అఖిల భారత రైతు సంఘాలు ఈనెల 27న భారత్‌బంద్ నేపథ్యంలో సోమవారం రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల పరిధిలో జరిగే పరీక్షలను వాయిదా వేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రవాణా, ఇతర సేవలు పూర్తిగా బంద్ అవుతాయనీ, విద్యార్థులు దూరప్రాంతాల నుంచి పరీక్షలు రాయడానికి చేరుకునేందుకు ఇబ్బంది అవుతుందని తెలిపారు. వారు నష్టపోకుండా ఉండేందుకు సోమవారం జరిగే పరీక్షలను, ప్రవేశపరీక్షలను వాయిదా వేయాలని కోరారు.