Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉన్నత విద్యామండలి మాజీ చైర్మెన్ తుమ్మల పాపిరెడ్డిని ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రితోపాటు అధికారులు, ఉద్యోగులు బుధవారం హైదరాబాద్‌లో సత్కరించారు. ఈ సందర్భంగా లింబాద్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నత విద్యామండలి ఏర్పాటు చేసిన తర్వాత తొలి చైర్మెన్‌గా పాపిరెడ్డిని ప్రభుత్వం నియమించిందని గుర్తు చేశారు. ఆయన ఎంతో సేవ చేశారని వివరించారు. ఉన్నత విద్యాభివృద్ధికి కృషి చేశారని చెప్పారు. పాపిరెడ్డి మాట్లాడుతూ అంకితభావంతో, నిబద్ధతతో, మానవత్వంతో పనిచేయాలని సూచించారు. అందరితో కలిసి సమన్వయంతో పనిచేయడం వల్లే వృత్తిలో ఎదుగుదల ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో టీఏఎఫ్ఆర్సీ చైర్మెన్ జస్టిస్ పి స్వరూప్‌రెడ్డి, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మెన్ వి వెంకటరమణ, కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.